అన్ని సామాజిక మాధ్యమాలకు కొంత కాలం దూరంగా ఉండనున్నట్లు భారత రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఒలింపిక్స్ అనంతరం సోషల్ మీడియాలోకి మళ్లీ వస్తానని స్పష్టం చేశాడు.
"నా సామాజిక మాధ్యమాల ఖాతాలన్నింటిని ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నాను. పోటీల అనంతరం తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటివరకు నాపై అదే ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్" అని భజరంగ్ ట్వీట్ చేశాడు.
2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెల్చుకున్న భజ్రంగ్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అతడు 65 కిలోల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. దిల్లీ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో భజరంగ్ చివరిసారిగా పాల్గొన్నాడు. 'మార్చిలో జరిగే రోమ్ ర్యాంకింగ్ సిరీస్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనూ బరిలోకి దిగుతాను' అని వెల్లడించాడు.