షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు మనుబాకర్, రాహీ సర్నీబాత్ నిరాశపరిచారు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. చైనాలోని పుతియాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.
రెండు రాపిడ్ ఈవెంట్లలో 292, 291 పాయింట్లు సాధించిన మను.. మొత్తం 583 పాయింట్లు అందుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా, జర్మనీ షూటర్ డోరీన్.. 583 పాయింట్లే సాధించడం వల్ల స్కోరు సమమైంది.
ట్యాలీ ఆఫ్ ఇన్నర్ 10 ప్రకారం ఫలితం నిర్దేశించారు. ఎక్కువగా పది(షాట్‌కు) పాయింట్ల స్కోరు చేసిన డోరీన్ .. ఫైనల్‌కు అర్హత పొందింది. మను, ఎలీనా 17 సార్లు 10 పాయింట్ల స్కోరు చేస్తే.. జర్మన్ షూటర్ 23 సార్లు ఆ ఘనత అందుకుని ఫైనల్‌కు వెళ్లింది.
మరో భారత షూటర్ రాహీ సర్నోబాత్.. తుదిపోరుకు చేరడంలో విఫలమైంది. 569 పాయింట్లే సాధించి దిగువ నుంచి మొదటి స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
ఇదీ చదవండి: కొరియా మాస్టర్స్: రెండో రౌండ్లోకి శ్రీకాంత్, సమీర్