తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామన్వెల్త్​లో షూటింగ్ పరిస్థితి ఏంటి?

రానున్న కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్​ను తొలగించడం సమంజసం కాదని చెప్పింది భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ. ఏదేమైనా మేం ఐకమత్యంతో ఉంటామని స్పష్టం చేసింది.

By

Published : Jul 20, 2019, 2:43 PM IST

షూటింగ్

కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీడబ్ల్యూఎఫ్).. 2022లో జరిగే బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్ ను తొలగించాలని నిర్ణయించింది. ఇదే పోటీల్లో రెండుసార్లు స్వర్ణ పతకాలు సాధించిన హీనా సిద్ధు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

'ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. చాలా మంది షూటర్లు నిరాశ చెందారు. ఏదేమైనా మేం ఐకమత్యంతో ఉంటాం. ఇప్పుడు ఇది షూటింగ్ విషయంలో జరిగింది. కానీ చాలా ఏళ్ల క్రితమే రెజ్లింగ్​లోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. 2010లో షూటింగ్​ పోటీల్ని చాలా మంది వీక్షించారు. ఇలాంటి క్రీడను ఇప్పుడు తొలగించడం భావ్యం కాదు." -హీనా సిద్ధూ, మహిళా షూటర్

ఇది సంగతి:'టాప్​గన్' సీక్వెల్​తో టాప్​ లేపుతున్న టామ్​క్రూజ్​!

ABOUT THE AUTHOR

...view details