తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ విమానాశ్రయంలో మనుబాకర్​కు అవమానం!

దిల్లీ విమానాశ్రయంలో భారత యువ షూటర్​ మను బాకర్​కు అవమానం జరిగింది. షూటింగ్​ శిక్షణ కోసం తుపాకులు తీసుకెళ్తున్న తనను అధికారులు నేరస్తురాలిగా చూశారని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత కేంద్ర క్రీడల మంత్రి రిజుజు, విమానయాన శాఖ మంత్రి హర్​దీప్​సింగ్​ పూరికి ట్విట్టర్​లో ఫిర్యాదు చేసింది.

Shooter Manu Bhaker stopped at IGI Airport
దిల్లీ విమానాశ్రయంలో షూటర్​ మనుబాకర్​కు అవమానం!

By

Published : Feb 20, 2021, 11:15 AM IST

శిక్షణ కోసం వెళుతున్న తనను విమానాశ్రయ అధికారులు అకారణంగా ఆపి నేరస్తురాలిలా చూశారని భారత యువ షూటర్‌ మను బాకర్‌ ఆరోపించింది. భోపాల్‌ వెళుతుండగా ఆమెను దిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు రూ.10,200 సుంకం విధించారు.

తుపాకులు తీసుకెళ్లేందుకు తన దగ్గర అన్ని అనుమతి పత్రాలూ ఉన్నా కూడా సిబ్బంది వినలేదని.. ఆమె కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు, విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేసింది.

అయితే బాకర్‌ ట్విట్లకు వెంటనే స్పందించిన మంత్రులు ఆమె వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. రిజిజు, హర్‌దీప్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాకర్‌.. విమానాశ్రయ అధికారులు క్రీడాకారులను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ అవమానించొద్దని పేర్కొంది.

ఇదీ చూడండి:వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

ABOUT THE AUTHOR

...view details