తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కజకిస్థాన్​ ప్రెసిడెంట్స్​ కప్'లో శివ థాపకు స్వర్ణం - శివథాప, భారత బాక్సర్​

భారత బాక్సర్​ శివ థాప అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. కజకిస్థాన్​ ప్రెసిడెంట్స్​ కప్​లో పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.​

Shiva Thapa becomes India's first gold-medallist in Kazakhstan President's Cup

By

Published : Jul 20, 2019, 9:34 PM IST

ప్రెసిడెంట్స్​కప్​లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్​గా పేరు లిఖించుకున్నాడు నాలుగుసార్లు ఆసియా ఛాంపియన్​ శివ థాప. శనివారం కజకిస్థాన్​లోని ఆస్తానా వేదికగా ఈ టోర్నీ ఫైనల్​ జరిగింది. ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి జాకిర్​ సఫుల్లిన్​ గాయం కారణంగా వైదలగడం వల్ల విజేతగా నిలిచాడు శివ.

శివ థాప

63 కేజీల విభాగంలో ప్రెసిడెంట్స్​ కప్​లో పాల్గొన్నాడు. శనివారం జరగాల్సిన ఫైనల్​ మ్యాచ్​లో కజకిస్థాన్ ఆటగాడు​ జాకిర్​ సఫుల్లిన్​తో రింగ్​లో దిగాల్సింది. గాయం కారణంగా ప్రత్యర్థి టోర్నీ నుంచి వైదొలగడం వల్ల శివను విజేతగా ప్రకటించారు. ఇదే ఏడాది జరిగిన ఆసియా​ ఛాంపియన్​షిప్​ సెమీఫైనల్లో జాకిర్​ చేతిలో ఓటమి పాలయ్యాడు శివథాప. అయితే ఈ మ్యాచ్​లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత స్టార్​ బాక్సర్​కు నిరాశే ఎదురైంది.

" కొత్త కేటగిరీలో బరిలోకి దిగాను. ఈ టోర్నీలో కష్టమైన బౌట్​లు ఏమి ఎదుర్కోలేదు. 64 కేజీల విభాగం నుంచి వచ్చిన బాక్సర్లతో పోటీపడటం కష్టమే కాని అసాధ్యమైతే కాదని తెలుసుకున్నా".
-- శివథాప, భారత బాక్సర్​

గతంలో శివ 60 కేజీల విభాగంలో ఒలింపిక్స్​లో పాల్గొన్నాడు. అయితే ఈ కేటగిరీని తొలగించడం వల్ల 63 కేజీల విభాగంలో మ్యాచ్​లకు సన్నద్ధమవుతున్నాడు.
ఇదే టోర్నీలో కొందరు భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. ప్రవీణ్(60 కేజీలు)​ ఫైనల్లో ఓటమి పాలై వెండి పతకం సాధించాడు.

వెండి గెలిచిన ప్రవీణ్​

సెమీఫైనల్లో ఓటమిపాలైన బూర స్వీటీ(81 కేజీలు), దుర్యోధన్​ సింగ్​ నేగి(69 కేజీ) కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details