36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్(ఇండివిడ్యుయల్ పోల్) క్రీడలో శౌర్యజిత్ కాంస్య పతకం సాధించి.. తాజా జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
చిన్నారి అథ్లెట్ అద్భుత విన్యాసాలు.. 36వ జాతీయ క్రీడల్లో రికార్డ్ - అథ్లెట్ శౌర్యజిత్ ఖైరే రికార్డ్
36వ జాతీయ క్రీడల్లో ఓ చిన్నారి అథ్లెట్ చరిత్ర సృష్టించాడు. తన విన్యాసాలతో అందరూ నోరెళ్లబెట్టేలా చేశాడు. ఓ సారి ఆ చిన్నారి విన్యాసాలు చూసేయండి..
చిన్నారి అథ్లెట్ అద్భుత విన్యాసాలు
ఈ క్రీడాంశంలో శౌర్యజిత్.. తన విన్యాసాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేశాడు. అతడి విన్యాసాలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, గుజరాతీ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించారు.
ఇదీ చూడండి: ఈ క్రికెటర్స్ గ్రౌండ్‌లోనే కాదు సిల్వర్స్క్రీన్పైనా హిట్టే