తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon 2022: సెరెనాకు షాక్.. తొలిరౌండులోనే ఇంటిముఖం

Serena Willaims: సుమారు ఏడాది తర్వాత కోర్టులోకి పునరాగమనం చేసిన టెన్నిస్​ స్టార్ సెరెనా విలియమ్స్ ఈసారి కూడా వింబుల్డన్ తొలి రౌండులోనే నిష్క్రమించింది. ఫ్రాన్స్‌కు చెందిన హార్మనీ ట్యాన్ చేతిలో పరాజయం పాలైంది. మూడు గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్​లో విజయం ప్రత్యర్థినే వరించింది.

Serena Willaims
Serena Willaims

By

Published : Jun 29, 2022, 12:08 PM IST

Serena Willaims: గతేడాది గాయం కారణంగా వింబుల్డన్​ తొలిరౌండులోనే నిష్క్రమించి అభిమానులను నిరాశకు గురి చేసిన టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​.. మరోసారి పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది వింబుల్డన్​ తొలి రౌండులోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఈ స్టార్ ప్లేయర్​.. వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారిణి హార్మనీ ట్యాన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది. ఘోర పరాభవంతో నిష్క్రమించినప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడింది సెరెనా.

Wimbledon 2022: మూడు గంటల పది నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ఫ్రాన్స్ స్టార్.. సెరెనాను దీటుగా ఎదుర్కొంది. 5-7. 6-1, 6-7(7) తేడాతో ఓటమి పాలైంది సెరెనా. నిదానంగా గేమ్‌ను ఆరంభించిన సెరెనా.. చివరి వరకు పోరాడినప్పటికీ విజయం ప్రత్యర్థికే వరించింది. ఓపెనింగ్ సెట్‌ను కోల్పోయినప్పటికీ తిరిగి పుంజుకున్న సెరెనా.. తనదైన శైలిలో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. డిసైడర్‌లో పాయింట్‌ను కాపాడుకుని టై బ్రేకర్‌కు అవకాశమిచ్చింది. టైబ్రేకర్‌లో 4-0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ హార్మీ బలంగా ప్రతిఘటించడం వల్ల చివరకు మ్యాచ్‌ను చేజార్చుకుంది సెరెనా.

ఈ మ్యాచ్‌తోనే వింబుల్డన్ అరంగేట్రం చేస్తున్న హార్మనీ ట్యాన్‌కు ఇది అత్యుత్తమ విజయం. "డ్రా అయిన తర్వాత నాకు చాలా భయం వేసింది. నేను సెరెనాతో ఒకటి లేదా రెండు సెట్స్​ మాత్రమే గెలుస్తాననుకున్నా. కానీ మ్యాచ్ గెలవడం ఎంతో ఆనందంగా ఉంది" అని హార్మనీ చెప్పింది. సెరెనా విలియమ్స్‌కు గత రెండు, మూడేళ్లుగా ఏమాత్రం కలిసి రావడం లేదు. ఫామ్ లేమితో వరుస పరాజయాలను చవిచూస్తున్న ఈ అమెరికా క్రీడాకారిణి తన ఫేవరెట్ వింబుల్డన్‌లోనూ పరాజయం పాలైంది. ప్రస్తుతం 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్న ఈ స్టార్.. మార్గరెట్ కోర్టు 24 గ్రాండ్ స్లామ్ల రికార్డును సమం చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది.

ఇదీ చదవండి:తెలుపు దుస్తులు.. 23 టన్నుల స్ట్రాబెర్రీలు.. వింబుల్డన్​ క్రేజీ విశేషాలివే..!

ABOUT THE AUTHOR

...view details