భారత రెజ్లర్ సుశీల్ కుమార్ హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మల్లయోధుడు సాగర్ రానా హత్యకు అసలు కారణం ఇంటి అద్దె గురించి వచ్చిన ఘర్షణ కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు సాగర్ స్నేహితుడు సోను గర్ల్‌ఫ్రెండ్ కారణంగానే గొడవ ప్రారంభమైందని విచారణలో స్పష్టమైంది.
అసలు ఏం జరిగింది?
సుశీల్‌కు సంబంధించి దిల్లీలోని మోడల్ టౌన్ ఫ్లాట్‌లో సాగర్ రానా అద్దెకుండేవాడు. అప్పటికే అద్దె విషయంలో సుశీల్ స్నేహితుడు అజయ్ పలుమార్లు సాగర్‌ను హెచ్చరించాడు. ఫ్లాట్ ఖాళీ చేయాలని సూచించాడు.
ఇదీ చదవండి:టోక్యో ఒలింపిక్స్‌కు రెజ్లర్ సుమిత్ అర్హత
కానీ, మార్చిలో సోను పుట్టినరోజు సందర్భంగా అతడి స్నేహితురాలి సమక్షంలో వేడుకలు చేయలనుకున్నాడు సాగర్. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక అతిథిగా సోను గర్ల్‌ఫ్రెండ్‌ను ఆహ్వానించారు. ఇవన్నీ తెలిసి అజయ్ ఆ ఫ్లాట్ వద్దకు చేరుకుని.. సోను గర్ల్‌ఫ్రెండ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాగర్, సోను.. అజయ్‌తో వాగ్వాదానికి దిగారు.
అప్పటికే సుశీల్, సాగర్ మధ్య వివాదాలు ఉండడం వల్ల.. విషయాన్ని సుశీల్‌కు చెప్పాడు అజయ్. దీంతో వారిద్దరినీ స్టేడియానికి బలవంతంగా తీసుకొచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు సుశీల్ గ్యాంగ్. ఈ గొడవల్లో తీవ్రంగా గాయపడిన సాగర్ మే 4న చనిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసులు విచారణలో వెల్లడయ్యాయి. ప్రస్తుతం సుశీల్‌తో పాటు అజయ్ జైలులో ఉన్నారు.
ఇదీ చదవండి:Sushil Kumar: 'మిల్క్‌షేక్, వ్యాయామ పరికరాలు కావాలి!'