కరోనా వైరస్ కారణంగా స్వీయ నిర్బంధంలో ఉంటున్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.. తన జీవితంలో అసలైన స్వేచ్ఛను ఇప్పుడే అనుభవిస్తున్నట్లు చెప్పింది. కొన్ని రోజుల కిందటే జోర్డాన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొని స్వదేశానికి చేరుకుంది. వైద్య పరీక్షల్లో మేరీకి కరోనా వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధారించినప్పటికీ.. ఆమె దిల్లీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటోంది.
స్వీయ నిర్బంధం మంచిదే: మేరీకోమ్ - మేరీకోమ్
ఇటీవలే జోర్డాన్ బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చిన మేరీకోమ్.. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. కరోనా వల్ల కుటుంబంతో కొంత సమయాన్ని గడిపే అవకాశం లభించిందని తెలిపింది.
"ఈ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా. బయటి వాళ్లెవ్వరికీ నన్ను కలిసే అవకాశం ఇవ్వట్లేదు. ఈ స్వీయ నిర్బంధంలో మంచి విషయం ఏంటంటే.. రోజు మొత్తం దేని గురించీ ఆలోచించకుండా కుటుంబంతోనే గడపడం. ఇప్పుడు పిల్లలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నా. 10-15 రోజుల పాటు ఏ అంతరాయం లేకుండా నాతో గడుపుతున్నందుకు పిల్లలెంత సంతోషంగా ఉన్నారో చెప్పలేను. ఈ సమయంలో అందరికీ నేను చెప్పేదొకటే. కంగారు పడకండి. ఇంటికే పరిమితమై కుటుంబంతో సమయం గడపండి. నా వరకు స్వీయ నిర్బంధం వల్ల స్వేచ్ఛను అనుభవిస్తున్నా" అని చెప్పింది మేరీకోమ్.
ఇదీ చూడండి.. కరోనా కట్టడిపై హిందీలో పీటర్సన్ ట్వీట్