కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై రోజుకో మాట వినిపిస్తోంది. ఒలింపిక్స్ రద్దు చేసే అంశం పరిశీలనలో ఉందని జపాన్ అధికార పార్టీ ఎల్డీపీ జనరల్ కార్యదర్శి తొహిషిరో వ్యాఖ్యానించి రోజైనా గడవకముందే.. ఆ మెగా క్రీడలను రద్దు చేసే అవకాశమే లేదని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి:'ఛలో ఛలో' పాట ధోనీకి అంకితం: రెహమాన్
"ఒలింపిక్స్ నిర్వహణ దిశగా విభిన్నమైన సవాళ్లు ఉన్నాయి. కానీ ఆ మెగా క్రీడలను రద్దు చేసే ఆలోచనలో టోక్యో 2020 నిర్వాహక కమిటీకి లేదు. ఒలింపిక్స్ వేదికలు, పాటించాల్సిన నిబంధనల గురించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం" అని హషిమోటో వెల్లడించింది. మరోవైపు ఆ దేశ ప్రధాని సుగా కూడా ఒలింపిక్స్‌ను పూర్తి ఆరోగ్యకర వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒలింపిక్స్ ఈ జులై 23న ఆరంభం కానున్నాయి.
ఇదీ చదవండి:ప్రభాస్ జాబితాలో మరో సినిమా..!