ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసేందుకు 12 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ. ఇందులో భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్, హాకీ స్టార్ సర్దార్ సింగ్‌లు ఉన్నారు. గత సంవత్సరంలానే అథ్లెట్లు, కోచ్‌ల రెండు విభాగాల్లో అవార్డు గ్రహీతలను ఎంపిక చేయనున్నారు. ఈ బృందానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వం వహిస్తారు. ఈ ప్యానల్లో పారాలింపిక్ రజత పతక విజేత దీపా మాలిక్ ఉన్నారు.
"ఈ ఏడాదీ అన్ని అవార్డులకు ఒకే సెలక్షన్ కమిటీ నియామకాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ కమిటీల వల్ల పరిణామాలు కష్టం కావడం సహా వివాదాలు వస్తున్నాయి" అని క్రీడా మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన ఇద్దరు అదనపు సభ్యులను ఛైర్‌పర్సన్‌గా ఆహ్వానించవచ్చని.. ద్రోణాచార్య నామినేషన్లనూ పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
కమిటీలో ఎవరు?