తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాత్విక్‌- చిరాగ్‌ జోడీ సంచలనం.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్​ కైవసం - సాత్విక్‌ సాయిరాజ్‌ చిరాగ్‌శెట్టి జోడీ

French Open 2022 Winner: ఫ్రెంచ్ ఓపెన్​లో భారత ప్లేయర్లు సత్తాచాటారు. సాత్విక్ సాయిరాజ్​-చిరాగ్​ శెట్టి జోడీ టైటిల్​ కైవసం చేసుకుంది.

satwik anand chirag shetty  won french open
satwik anand chirag shetty won french open

By

Published : Oct 31, 2022, 10:29 AM IST

French Open 2022 Winner: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌ జంట 21-13, 21-19తో లూ చింగ్‌ యో-యంగ్‌ పొ హన్‌ (తైవాన్‌)ని ఓడించింది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే సాత్విక్‌ జోడీ దూకుడుగా ఆడింది. 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జంట ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా తగ్గలేదు. అదే జోరుతో గేమ్‌ గెలుచుకుంది.

రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోడీ నుంచి భారత జంటకు గట్టిపోటీనే ఎదురైంది. ఒక దశలో సాత్విక్‌ జంట 7-4తో నిలిచినా లూ చింగ్‌ ద్వయం పుంజుకుంది. 19-17తో ఆధిక్యంలోకి కూడా వెళ్లింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సాత్విక్‌ జోడీ 21-19తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details