ఈ ఏడాది జరగబోయే యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతానన్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన నిర్ణయాన్ని మార్చుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీలో పాల్గొనలేకపోతున్నట్లు ప్రకటించింది. అందుకే తన రిటైర్మెంట్ ప్లాన్‌ను కూడా మార్చుకుంటున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మోచేయికి గాయం కారణంగా టోర్నీలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించింది. తనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పేర్కొంది.
యూఎస్ ఓపెన్‌కు సానియా దూరం, రిటైర్మెంట్ ప్లాన్‌లోనూ మార్పు - సానియా మీర్జా రిటైర్మెంట్
స్టార్ టెన్నిస్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్‌ను మార్చుకున్నట్లు తెలిపింది.
"రెండు వారాల క్రితం కెనడాలో టెన్నిస్ ఆడుతుండగా నా మోచేతికి గాయమైంది. సోమవారం వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్స్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. దీని కారణంగా యూఎస్ ఓపెన్ టోర్నీకీ దూరం కావాల్సి వచ్చింది. దీంతో నా రిటైర్మెంట్ ప్లాన్‌లో మార్చులు చేసుకున్నాను. దీనిపై మరికొద్ది రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తాను" అని సానియా మీర్జా పోస్ట్ చేసింది. కాగా, ఆగష్టు 23 నుంచి సెప్టెంబర్ 12 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది.
ఇవీ చదవండి
టీమ్ఇండియాకు భారీ షాక్.. రాహుల్‌కు కరోనా పాజిటివ్
ప్రపంచ ఛాంపియన్‌కు మళ్లీ భారీ షాకిచ్చిన ప్రజ్ఞానంద