తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్​పై సానియా మీర్జా కొత్త ప్రకటన.. ఏమందంటే? - సానియా మీర్జా రిటైర్మెంట్‌ వేదిక

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై కొత్త ప్రకటన చేసింది. గత ఏడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో చెప్పేసింది.

sania mirza retirement
sania mirza

By

Published : Jan 7, 2023, 9:09 AM IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై కొత్త ప్రకటన చేసింది. గత ఏడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొత్త ఏడాదిలో ముందుగా 36 ఏళ్ల సానియా ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడనుంది.

అందులో కజకిస్థాన్‌ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్‌లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్‌ కానుంది. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్‌లో ఆమె కెరీర్‌ చిట్టచివరి టోర్నీ ఆడనుంది. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అందుకే రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుంది. "నిజాయితీగా చెప్పాలంటే నేను ఏ విషయమైనా నాకు ఇష్టమైన రీతిలో చేయాలనుకుంటా. గాయంతో కెరీర్‌ను ముగించాలనుకోలేదు. అందుకే మళ్లీ సాధన చేశా" అని సానియా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details