తన కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్‌ను ఆడుతున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో కో ప్లేయర్ రోహన్ బోపన్నతో కలిసి బ్రిటన్ జోడీని చిత్తుగా ఓడించింది. దీంతో ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అలా ఫైనల్స్‌తో తన ఏడో మేజర్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని సంపాదించుకుంది సానియా.
ఒక్క అడుగు దూరంలో సానియా మీర్జా.. గెలిస్తే.. - రోహన్ బోపన్న లేటెస్ట్ న్యూస్
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అదరగొడుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో బ్రిటన్ టీమ్‌ను ఓడించిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు గ్రాండ్ స్లామ్‌ను కైవశం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉంది.
sania and rohan
సుమారు 1 గంట 52 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్ భారత జోడీ 7-6(5) 6-7(5) 10-6తో మూడో సీడ్ డెసిరే క్రావ్జిక్, నీల్ స్కుప్స్కీ జోడీని సానియా బోపన్న జోడీ మట్టి కరిపించింది. కాగా సానియా తన కెరీర్లో మూడు మహిళల డబుల్స్‌తో పాటు అనేక మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. మరోవైపు బోపన్న ఒక మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.