తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2022, 3:05 PM IST

Updated : Jan 19, 2022, 3:38 PM IST

ETV Bharat / sports

సానియా మీర్జా సంచలన నిర్ణయం.. ఆటకు వీడ్కోలు

Sania Mirza Retirement: భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా ఫ్యాన్స్​కు షాకిచ్చింది. ఆటకు గుడ్​బై తెలపబోతున్నట్లు పేర్కొంది. 2022 సీజన్​ తనకు చివరిదని ప్రకటించింది.

Sania Mirza Retirement
Sania Mirza Retirement

Sania Mirza Retirement: భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్​ తర్వాత ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా నేడు జరిగిన మహిళల డబుల్స్​ ఈవెంట్​ ఓటమి చెందిన అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ ఈవెంట్​లో భారత్​కు చెందిన సానియా మీర్జా, ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్ జంట ఓపెనింగ్​ రౌండ్​లోనే ఓడిపోయింది. స్లొవేనియాకు చెందిన కాజా జువన్, తమర జిడన్​సెక్​ జంట చేతిలో 6-4, 7-6 తేడాతో ఓటమి చవిచూసింది.

"ఇదే నా చివరి సీజన్​ అని నేను నిర్ణయించుకున్నాను. ఈ సీజన్​ మొత్తం ఆడగలనో లేదో చెప్పలేను కానీ పూర్తిగా ఆడాలనుకుంటున్నాను. ఈ రిటైర్మెంట్​కు చాలానే కారణాలు ఉన్నాయి. ఇది అంత ఈజీ కాదని తెలుసు. కానీ తప్పదు. ప్రయాణాలు చేస్తూ నా మూడేళ్ల కొడుకును రిస్క్​లో పెట్టలేను. నా శరీరం కూడా సరిగ్గా సహకరించట్లేదు. ఇవాళ నా మోకాలు కూడా బాగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఇదే కారణం వల్లే నేను ఓడిపోయానని చెప్పను. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటున్నా. నా వయసు కూడా అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యూఎస్‌ ఓపెన్‌ (జూన్‌ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్‌ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది." అని సానియా పేర్కొంది.

సానియా.. తన కెరీర్​లో ఆరు గ్రాండ్​స్లామ్​లు గెలిచింది. వీటిలో మూడు టైటిల్స్​ మహిళల డబుల్స్​ కాగా.. మరో మూడు మిక్స్​డ్​ డబుల్స్​లో సాధించింది. 2003 నుంచి ఆడుతున్న ఈమె 2013 నుంచి సింగిల్స్​ ఆడటం మానేసింది. అప్పటి నుంచి డబుల్స్​ మాత్రమే ఆడుతోంది. అంతర్జాతీయంగా ఆమె 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా మిక్స్​డ్​ డబుల్స్​లో అమెరికాకు చెందిన రాజీవ్​ రామ్​తో కలిసి బరిలో దిగనుంది.


ఇదీ చూడండి: షారుక్​, సంజయ్​దత్​ తర్వాత సానియాదే ఆ ఘనత

Last Updated : Jan 19, 2022, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details