తెలంగాణ

telangana

ETV Bharat / sports

Sania Mirza: 'ఒలింపిక్​ మెడల్​ లేకపోయినా బాధలేదు.. నేను ట్రెండ్​ సెట్టర్​ను కాను!' - సానియా మీర్జా అప్డేట్లు

రెండు దశాబ్దాల పాటు తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా కెరీర్​ ముగిసింది. నంబర్‌ వన్​ స్థాయికి ఎదిగిన​ సానియా మీర్జా.. ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేసింది.

sania mirza
sania mirza

By

Published : Feb 22, 2023, 11:25 AM IST

Updated : Feb 22, 2023, 11:47 AM IST

ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. నంబర్‌ వన్​ స్థాయికి ఎదిగిన స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా.. ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనైంది. దుబాయ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి ద్వారా ప్లేయర్‌గా సానియా టెన్నిస్‌ కెరీర్‌ ముగిసిపోయింది.

"నా జీవితంలో టెన్నిస్‌ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్‌ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ వచ్చి గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు. ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా దాంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్‌ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది. దానికి నేను గర్విస్తున్నా. సింగిల్స్‌లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్‌ 30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే. మణికట్టుకు శస్త్రచికిత్సల తర్వాత సింగిల్స్‌లో ఆడటం ఇబ్బందిగా మారడంతో డబుల్స్‌కు మారాను తప్ప ఆడలేక కాదు. ఎక్కడైనా నంబర్‌వన్‌ అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్‌ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా. నేనో ట్రెండ్‌ సెట్టర్‌గా భావించడం లేదు. నాకు వచ్చిన, నచ్చిన రీతిలో ఆడుతూ పోయాను. ఆ క్రమంలోనే ఈ విజయాలన్నీ వచ్చాయి" అని భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేసింది.

ఐదేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకుంది. మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచి మరే ఇతర భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో రికార్డులు నెలకొల్పింది. 43 డబుల్స్‌ ట్రోఫీలు సాధించింది. 91 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగింది.

Last Updated : Feb 22, 2023, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details