తెలంగాణ

telangana

ETV Bharat / sports

జర్నీ మొదలుపెట్టిన చోటే ముగించిన సానియా.. ఫేర్​వెల్​ మ్యాచ్​లో టెన్నిస్​ క్వీన్​ కంటతడి!

క్రీడాకారిణిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన చోటే తిరిగి ముగించింది టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​ సానియా మీర్జా. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం (మార్చి 5) జరిగిన ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆమె భావోద్వేగానికి లోనైంది. 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది.

sania mirza emotional in farwell match held in lb stadium hyderabad
Etv sania mirza emotional in farwell match held in lb stadium hyderabad

By

Published : Mar 5, 2023, 3:42 PM IST

Updated : Mar 5, 2023, 6:12 PM IST

కొద్దిరోజుల క్రితం ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం (మార్చి 5) జరిగిన ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొంది. సింగిల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. సానియా క్రీడాకారిణిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రాంతంలోనే తిరిగి ముగించింది.

"20 ఏళ్లుగా దేశం తరఫున ఆడడం నాకు దక్కిన గొప్ప గౌరవం. తమ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించాలనేది ప్రతి క్రీడాకారిణి కల. నేను అలా చేయగలిగాను" అని తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది సానియా. అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయింది. "ఇవి చాలా చాలా సంతోషకరమైన కన్నీళ్లు. ఇంతకంటే మంచి సెండ్-ఆఫ్ కోసం నేను అడగలేకపోయాను" అని ఆమె చెప్పింది. దేశంలో చాలా మంది సానియాలు ఆవిర్భవించాలని ఆమె ఆకాంక్షించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు అభిమానులు 'మేము నిన్ను మిస్​ అవుతున్నాం సానియా' అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకున్నారు. అంతకుముందుకు ఆమె కోర్టులోకి ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు, పిల్లలు ఆమెను ఉత్సాహపరిచారు.

సానియా మీర్జా
సానియా మీర్జా

"నేను సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చాను. దీని కోసం చాలా మంది ప్రజలు రావడం చూసి నేను సంతోషిస్తున్నాను. సానియా మీర్జా భారత టెన్నిస్‌కే కాకుండా భారతదేశ క్రీడలకు కూడా స్ఫూర్తి. నేను క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు నేను సానియాతో టచ్‌లో ఉండేవాడిని" అని మంత్రి రిజిజు అన్నారు.

బోపన్నతో సానియా మీర్జా

సానియా ఆడే చివరి మ్యాచ్‌ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు విచ్చేశారు. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, సీతారామం హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ ఈవెంట్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేశ్​ బాబు, అల్లు అర్జున్, ఏ ఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌తో తోపాటు మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

సానియా మీర్జా

కాగా, సానియా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్‌, ఏషియన్ గేమ్స్​లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్​లో 2 మెడల్స్ సాధించింది. ఈ హైదరాబాదీ క్వీన్‌ డబుల్స్​లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగింది. భారత టెన్నిస్‌కు సేవలందించినందకు గాను సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతోపాటు అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులు వరించాయి. సానియా ప్రస్తుతం మహిళల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తోంది.

Last Updated : Mar 5, 2023, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details