తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2019, 7:59 PM IST

Updated : Dec 8, 2019, 8:05 PM IST

ETV Bharat / sports

దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

నేపాల్ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో(శాగ్) భారత స్టార్ రెజ్లర్ సాక్షిమాలిక్ స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం ముగియనున్న ఈ పోటీల్లో భారత్..​ 229 పతకాలతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Sakshi wins gold to lead India's complete domination in wrestling
దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల ప్రవాహం పెరుగుతూనే ఉంది. 200కు పైచిలుకు మెడల్స్​తో అగ్రస్థానంలో ఉన్న భారత్​ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. రియో ఒలింపిక్స్ కాంస్య గ్రహీత సాక్షిమాలిక్.. అన్ని మ్యాచ్​ల్లో గెల్చుకుంటూ వచ్చి పసిడి సొంతం చేసుకుంది.

రెజ్లింగ్​లో భారత్​ తిరుగులేకుండా దూసుకుపోతోంది. పోటీపడిన 12 విభాగాల్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకుమన రెజ్లర్లు కొద్ది దూరంలోనే ఉన్నారు. 61 కేజీల విభాగంలో రవీందర్.. పాకిస్థాన్​కు చెందిన బిలాల్​ను ఓడించాడు.

పవన్ కుమార్(84 కేజీలు), అన్షు(59 కేజీలు) వారివారి విభాగాల్లో పసిడి సొంతం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం.. గౌరవ్ బలియాన్(74 కేజీలు), అనితా షియోరాన్​(68కేజీలు) పోటీ పడనున్నారు.

భారత్ ఇప్పటివరకు మొత్తం 229 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. 119 స్వర్ణాలు, 72 రజతాలు, 38 కాంస్యాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 154 మెడల్స్​తో(44 స్వర్ణాలు, 40 రజతాలు, 70 కాంస్యాలు) నేపాల్​ రెండో స్థానంలో, 183 పతకాలతో(32 స్వర్ణాలు, 61 రజతాలు, 90 కాంస్యాలు) శ్రీలంక మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

Last Updated : Dec 8, 2019, 8:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details