తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో 'సాక్షి'కి నిరాశ - wresrling

కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో సాక్షి మాలిక్ తొలి రౌండ్​లోనే ఓటమిపాలైంది. నైజీరియాకు చెందిన అమినాట్ చేతిలో పరాజయం చెందింది. మరో రెజ్లర్ బజరంగ్ పునియా.. పొలాండ్ ఆటగాడు క్రిస్టాఫ్​పై విజయం సాధించాడు.

సాక్షిమాలిక్

By

Published : Sep 19, 2019, 3:19 PM IST

Updated : Oct 1, 2019, 5:08 AM IST

రియో ఒలింపిక్స్ పతక గ్రహీత సాక్షి మాలిక్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​​షిప్​లో సత్తాచాటలేకపోయింది. కజకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో నైజీరియాకు చెందిన అమినాట్ అదెనీయి చేతిలో పరాజయం చెందింది.

62 కేజీల విభాగంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్​ తొలి రౌండ్​లో ప్రతర్థిపై 7-10 పాయింట్ల తేడాతో ఓడింది. ఆరంభంలో 6-0తో ముందున్న సాక్షి మాలిక్ అనంతరం వెనకబడింది. రెండో రౌండ్​లో అమినాట్ పుంజుకుని 7-10 తేడాతో గెలిచింది.

మరో మ్యాచ్​లో టీమిండియా రెజ్లర్ బజరంగ్ పునియా శుభారంభం చేశాడు. 65 కేజీల విభాగంలో పొలాండ్​కు చెందిన క్రిస్టాఫ్ బయాంకో​స్కీని 9-2 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో తొలిసారి స్వర్ణం నెగ్గి.. ఒలింపిక్స్ బెర్త్​నూ ఖరారు చేసుకోవాలనుకుంటున్నాడు పునియా.

బజరంగ్ పునియా

ఇదీ చదవండి: ముందు కోహ్లీ.. తర్వాత మిల్లర్.. వాట్ ఏ క్యాచ్​

Last Updated : Oct 1, 2019, 5:08 AM IST

ABOUT THE AUTHOR

...view details