స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో ఏ కట్ కొట్టిన తొలి భారత స్మిమ్మర్గా రికార్డులకెక్కాడు. రోమ్‌లో జరుగుతున్న సెట్టె కోలీ ట్రోఫీ పురుషుల 200మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో 1:56:38 సెకన్లలో ఒలింపిక్స్ అర్హత మార్కును సాధించాడు.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత స్విమ్మర్ - బటర్‌ఫ్లై ఈవెంట్
భారత స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా నిలిచాడు.
సాజన్ ప్రకాశ్
టోక్యో గేమ్స్ ఏ స్టాండర్డ్ 1:56.48 సెకన్లను .. 0.1 సెకన్ల తేడాతో అందుకున్నాడు కేరళ స్విమ్మర్ సాజన్. బటర్‌ఫ్లై ఈవెంట్లో కొన్నాళ్లుగా తన ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ వస్తున్నాడు.