తెలంగాణ

telangana

ETV Bharat / sports

SAI awards: అథ్లెట్లకు సాయ్​ పురస్కారాలు ప్రదానం - SAI award letter

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసిన 246 మంది అథ్లెట్లు, కోచ్​లకు అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి (SAI Institutional Awards) ఇన్​స్టిట్యూషనల్​ అవార్డులను ప్రదానం చేసింది.

SAI Institutional Awards
సాయ్ పురస్కారాలు

By

Published : Nov 18, 2021, 6:01 AM IST

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి (SAI Institutional Awards) ఇన్​స్టిట్యూషనల్​ అవార్డులను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్​లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది. ఈ కార్యక్రమానికి భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ హాజరయ్యారు.

"అవార్డులు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అథ్లెట్ నేటితరానికి స్ఫూర్తిదాయకం. ఆటలు జాతీయ విద్యా విధానంలో భాగమే. మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను"

-అనురాగ్ ఠాకూర్​, భారత క్రీడా శాఖ మంత్రి

2016 నుంచి గతేడాది వరకు ఆటల్లో మంచి ఫలితాలు కనబరిచిన అథ్లెట్లకు, కోచ్​లకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యత్తమ, ఉత్తమ పురస్కారాలు అనే రెండు జాబితాల్లో పురస్కారాలు ఇచ్చారు.

ఇదీ చదవండి:ICC rankings t20: కోహ్లీ మళ్లీ అదే స్థానంలో.. మెరుగైన వార్నర్

ABOUT THE AUTHOR

...view details