తెలంగాణ

telangana

ETV Bharat / sports

Saff championship 2023 winner : తొమ్మిదోసారి ఛాంపియన్​గా భారత్​

Saff championship 2023 winner : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ శాఫ్‌ ఛాంపియన్​షిఫ్​లో భారత్ మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌(శాఫ్‌)లో తొమ్మిదోసారి భారత జట్టు ఛాంపియన్​గా అవతరించింది.

By

Published : Jul 5, 2023, 6:45 AM IST

Saff championship 2023 winner
Saff championship 2023 winner : తొమ్మిదోసారి ఛాంపియన్​గా భారత్​

Saff championship 2023 winner : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను మరోసారి ముద్దాడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో షూటౌట్లో.. ఛెత్రి సేన 5-4తో కువైట్‌ను ఓడించింది. లీగ్‌ దశలో కువైట్‌తో జరిగిన పోరులో 1–1తో 'డ్రా' చేసుకున్న భారత్‌... ఫైనల్​లో మాత్రం పైచేయి సాధించింది. ఫలితంగా ఈ దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌(శాఫ్‌)లో తొమ్మిదోసారి భారత జట్టు ఛాంపియన్​గా అవతరించింది.

Saff championship 2023 final : మ్యాచ్ సాగిందిలా.. అయితే ఈ మ్యాచ్‌ ఫస్టాఫ్​ కువైట్‌దే ఆధిపత్యం సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌ఖాల్‌ది చేసిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ బ్రేక్​ సమయానికి ముందే భారత్‌ జట్టు అందుకు బదులు తీర్చుకుంది. ఆట 39వ నిమిషంలో చాంగ్తె.. బంతిని నెట్‌లోకి పంపడంతో భారత్​ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లకు అవకాశాలు వచ్చినా.. మరో గోల్​ మాత్రం చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్‌ పడలేదు. స్కోరు సమంగానే ఉంది. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. భారత్‌ తరఫున షూటౌట్లో సునీల్‌ ఛెత్రి, చాంగ్తె, సందేశ్‌ జింగాన్‌, మహేశ్‌ గోల్‌, సుబాసిస్‌ బోస్‌ చేయగా.. ఉదాంత సింగ్‌ మాత్రం చేయలేకపోయాడు. అతడు గురి తప్పాడు.

saff india vs kuwait final score : షూటాట్​ సాగిందిలా.. ఈ షూటౌట్లో తొలి ప్రయత్నంలో భారత్‌ తరఫున కెప్టెన్‌ ఛెత్రి గోల్‌ కొట్టగా.. కువైట్‌ ప్లేయర్​ అబ్దుల్లా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగు అవకాశాల్లో భారత్‌ మూడింటినే సద్వినియోగం చేసుకుంది. అయితే కువైట్‌ మాత్రం వరుసగా నాలుగు షాట్లను నెట్‌లోకి పంపింది. ఫలితంగా 4-4తో స్కోరు సమం అయింది. దీంతో ఆట సడన్‌డెత్​గా మారింది. ఈ ఆరో షాట్​లో భారత్‌ తరఫున మహేశ్‌ గోల్ బాదగా.. కువైట్‌ ప్లేర్ హజియా బాదిన గోల్​ను గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్ సంధూ అడ్డుకున్నాడు. ఫలితంగా ఛెత్రి సేనకు విజయం వరించింది. మొత్తంగా ఈ దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌(శాఫ్‌)లో భారత్‌కు ఇది తొమ్మిదో విజయం. గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021ల్లోనూ భారత్ విజయాలను దక్కించుకుంది.

Saff championship 2023 winner : తొమ్మిదోసారి ఛాంపియన్​గా భారత్​

ABOUT THE AUTHOR

...view details