వింబుల్డన్-2022 మహిళల విజేతగా నయా సంచలనం ఎలెనా రిబకినా నిలిచింది. ఫైనల్లో ట్యునీసియా అమ్మాయి ఆన్స్ జాబెర్‌పై గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. వీళ్లిద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. 2-6, 6-3, 6-3 తేడాతో ఎలెనా విజయం సాధించింది.
మొదటి సెట్‌ను కోల్పోయిన ఎలెనా.. తర్వాత పుంజుకొని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పోరాడింది. ఈ విజయంతో కజకిస్థాన్‌కు మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందించి రిబకినా చరిత్ర సృష్టించింది. రిబకినా రష్యాలో పుట్టి, కజకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
చరిత్ర సృష్టించిన రిబకినా.. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కైవసం - Wimbledon 2022
వింబుల్డన్ 2022లో మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్ వెలిసింది. ఎలెనా రిబకినా ఫైనల్‌లో ఓన్స్ జెబర్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన రిబకినా.. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కైవసం
Last Updated : Jul 9, 2022, 10:55 PM IST