తెలంగాణ

telangana

ETV Bharat / sports

మొనాకో పోటీల్లో రష్యా అథ్లెట్లకు అనుమతి! - మొనాకో టోర్నీలో రష్యా అథ్లెట్స్

అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో స్వతంత్ర హోదాలో తిరిగి పోటీపడేందుకు రష్యా అథ్లెట్లకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. డోపింగ్ కారణంగా ఆ దేశ జాతీయ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Russians to compete as neutral athletes again in track
మొనాకో పోటీల్లో రష్యా అథ్లెట్లకు అనుమతి!

By

Published : Mar 20, 2021, 8:31 AM IST

మొనాకో అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో స్వతంత్ర హోదాలో తిరిగి పోటీ పడేందుకు రష్యా అథ్లెట్లకు అనుమతి లభించనుంది. డోపింగ్ కారణంగా ఆ దేశ జాతీయ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ సమాఖ్యపై నిషేధం ఉన్నప్పటికీ దాని నుంచి అథ్లెట్లకు మినహాయింపు కల్పించి స్వతంత్ర హోదాలో పోటీ పడే అవకాశాన్ని పునరుద్ధరించాలని మరోసారి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది.

అథ్లెట్ల డోపింగ్ నివేదికల ఆధారంగా వాళ్లను పోటీల్లోకి అనుమతించనున్నారు. దీంతో రష్యాకు చెందిన మూడుసార్లు హైజంప్ ప్రపంచ ఛాంపియన్ మారియా, హార్డిల్స్​లో మాజీ ప్రపంచ ఛాంపియన్ షుబెంకోజ్ లాంటి అథ్లెట్లకు ఒలింపిక్స్​కు ముందు డైమండ్ లీగ్​లో పోటీ పడే అవకాశం దక్కుతుంది.

డోపింగ్ కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై 2015లో నిషేధం పడింది. ఆ తర్వాత ఆ దేశానికి చెందిన అథ్లెట్లు స్వతంత్ర హోదాలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. అయితే రష్యా హైజంప్ అథ్లెటిక్ లైసెంకో డోపింగ్ పరీక్ష నుంచి మినహాయింపు కోసం నకిలీ పత్రాలు సమర్పించడం వల్ల 2019లో ఆ దేశ సమాఖ్య ప్రతినిధులపై శిక్ష విధించిన ప్రపంచ సమాఖ్య ఆ విధానాన్ని రద్దు చేసింది.

ABOUT THE AUTHOR

...view details