తెలంగాణ

telangana

ETV Bharat / sports

రష్యా బాక్సింగ్ టోర్నీ​లో భారత్​కు మూడు పతకాలు - gourav

రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నీలో భారత బాక్సర్లు సత్తా చాటారు. కాస్పియస్క్​ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​ల్లో రెండు స్వర్ణాలు, ఒక వెండి పతకం గెలుచుకున్నారు. ఇద్దరు మహిళా బాక్సర్లు లవ్లీనా, నీరజ్​ పసిడి పంచ్​ విసిరగా... మరొక యువ బాక్సర్ ​గౌరవ్​ వెండి పతకం సొంతం చేసుకున్నాడు.

రష్యా బాక్సింగ్ టోర్నీ​లో భారత్​కు మూడు పతకాలు

By

Published : Aug 4, 2019, 5:30 AM IST

అంతర్జాతీయ వేదికపై భారత మహిళా బాక్సర్లు అదరహో అనిపించారు. రష్యాలో శనివారం జరిగిన 'మగ్మద్​ సలామ్ ఉమఖ్నోవ్ మెమోరియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీ' ఫైనల్లో ఇద్దరు మహిళా క్రీడాకారిణులు పసిడి గెలిచారు. స్టార్​ బాక్సర్​ లవ్లీనా బోర్గేన్​(69 కేజీలు) విభాగంలో పోటీపడి కాన్​ఫొరా(ఇటలీ)ను 3-2 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్​లో నీరజ్(57 కేజీలు) విభాగంలో షకిదోవా(రష్యా)పై 3-0 తేడాతో గెలిచింది. ఫలితంగా భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.

లవ్లీనా, నీరజ్​, గౌరవ్​

వెండితోనే సరి...

ఉమఖ్నోవ్​ టోర్నీలో పసిడి పతకంపై ఆశలు రేపిన యువ బాక్సర్​ గౌరవ్​ ఫైనల్లో నిరాశపరిచాడు. శనివారం జరిగిన మ్యాచ్​లో శరక్​మతోవ్​(ఉజ్బెకిస్థాన్​) చేతిలో 5-0 తేడాతో ఓడిపోయాడు. ఫలితంగా రజతంతోనే సరిపెట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details