తెలంగాణ

telangana

ETV Bharat / sports

రష్యాకు మళ్లీ షాక్​.. పారాలింపిక్స్​ నుంచి ఔట్​.. - Russia Ukraine news

Russian Athletes Ban: వింటర్ పారాలింపిక్స్‌ 2022 ప్రారంభం కానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ. రష్యా, బెలారస్​లకు చెందిన ఆటగాళ్లను పోటీల్లో పాల్గొనకుండా ఐపీసీ నిషేధించింది.

winter paralympic games
వింటర్ పారాలింపిక్స్‌ 2022

By

Published : Mar 4, 2022, 5:35 AM IST

Russian Athletes Ban: చైనా రాజధాని బీజింగ్​లో శుక్రవారం వింటర్​ పారాలింపిక్స్​ 2022 ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ(ఐపీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోటీలకు ర‌ష్యా, బెలార‌స్ దేశాలకు చెందిన అథ్లెట్ల‌పై ఐపీసీ నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. దివ్యాంగుల క్రీడ‌ల్లో ఆ రెండు దేశాల అథ్లెట్ల‌ను ఆడ‌నివ్వ‌బోమ‌ని పారాలింపిక్ క‌మిటీ వెల్ల‌డించింది.

రాజ‌కీయ ఒత్తిళ్ల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐపీసీ అధ్య‌క్షుడు ఆండ్రూ పార్స‌న్స్ తెలిపారు. ర‌ష్యా, బెలార‌స్ అథ్లెట్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆయా దేశ ప్ర‌భుత్వాల చ‌ర్య‌ల‌కు అథ్లెట్లు బ‌లయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ర‌ష్యా నుంచి 71 మంది, బెలార‌స్ నుంచి 12 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పోటీ ప‌డుతున్నారు.

"రాజకీయాల్ని, క్రీడలను ఒకటిగా చూడొద్దని అనుకున్నాం. కానీ మా తప్పు లేకుండానే క్రీడల్లోకి యుద్ధం వచ్చేసింది. అనేక ప్రభుత్వాలు క్రీడలను ప్రభావితం చేస్తున్నాయి. ఐపీసీ అనేది సభ్యత్వాలపై ఆధారపడిన సంస్థ. మా సభ్యుల అభిప్రాయాలను గౌరవించాలి. బుధవారం నుంచి మా సభ్యుల అభిప్రాయాలు వింటున్నాం. మేము తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయకుంటే బీజింగ్​ పారాలింపిక్స్​లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పారు. కొన్ని ప్రభుత్వాలు అథ్లెట్లు పోటీ చేయకుండా బెదిరిస్తున్నాయి."

-ఆండ్రూ పార్స‌న్స్,అధ్య‌క్షుడు అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ(ఐపీసీ)

రష్యా, ఉక్రెయిన్​ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాలో జరగాల్సిన అనేక ఈవెంట్లు రద్దు అయ్యాయి. ఛాంపియన్స్​ లీగ్​ ఫైనల్​ కూడా రష్యా నుంచి తరలిపోయింది. ఈ వేడుకకు పారిస్​ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదీ చదవండి:Russia Sports Ban: రష్యాను బహిష్కరించిన బ్యాడ్మింటన్​, హాకీ సమాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details