రష్యా తమ క్రీడాకారులను డోపింగ్‌కు ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు రుజువు కావడం వల్ల ఆ దేశపు పేరును, జెండా ఉపయోగంపై ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో నిషేధం పడింది. రాబోయే రెండు ఒలింపిక్స్ లేదా వచ్చే రెండేళ్లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రష్యా తన పేరు, జెండాను వాడకుండా ఆర్బిట్రేషన్ కోర్టు నిషేధం విధించింది. అయితే ఒలింపిక్స్‌తో పాటు నాలుగేళ్లలో జరిగే అన్ని ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రష్యా అథ్లెట్లు పోటీపడొచ్చు.
పేరు, జెండా లేకుండానే ఒలింపిక్స్‌లో రష్యా
రాబోయే రెండు ఒలింపిక్స్ లేదా రెండేళ్లలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రష్యా పేరు, ఆ దేశపు జెండా ఉపయోగానికి నిషేధం పడింది. క్రీడాకారులను డోపింగ్‌కు ప్రోత్సహించిందన్న అభియోగాలు రుజువు కావడం వల్ల ఆర్బిట్రేషన్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఒలింపిక్స్‌లో రష్యా జెండా ఉపయోగంపై నిషేధం
వచ్చే రెండేళ్లలో మేజర్ క్రీడా టోర్నీల హక్కుల కోసం కూడా రష్యా బిడ్డింగ్ వేయడానికి వీల్లేదు. పతకాల కోసం రష్యా ప్రభుత్వం ఆటగాళ్లను డోపింగ్‌కు ప్రోత్సహించిందన్న అభియోగాలు రుజువు కావడం వల్ల ఆ దేశ ఒలింపిక్ సంఘంపై వాడా గతంలో నిషేధం విధించింది.
ఇదీ చూడండి:ఇకపై క్రీడగా యోగా.. కేంద్రం ఆమోదం