ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీరుడు రాకెట్ చివరి మజిలీ పూర్తయింది. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు తెరదించుతూ.. 41 ఏళ్ల వయసులో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.
20 విజయాలతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను శనివారం అతడి కెరీర్ చివరి మ్యాచ్ ఆడాడు. లావెర్ కప్ 2022లో రోజర్ ఫెదరర్-రఫేల్ నాదల్ ద్వయం, అమెరికాకు చెందిన జాక్ సోక్-ఫ్రాన్స్ టిఫో డబుల్స్ మధ్య జరిగిన మ్యచ్‌లో ఫెదర్-నాదల్ ద్వయం ఓటమి పాలైంది. దీంతో ఆఖరి మ్యాచ్ ఓడిపోయి.. ఆటకు వీడ్కోలు పలికాలు ఫెదరర్.
ఫెదరర్.. రఫేల్ నాదల్‌తో జతకట్టి మంచి ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌లో మొదటి సెట్ గెలిచి శుభారంభం చేశారు. కానీ సెకండ్ సెట్లో అమెరికన్లు పుజుకున్నారు. దీంతో సమం అయింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో సెట్లో ఫెదరర్ ద్వయం ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం రోజర్ ఫెదరర్ భాగోద్వేగానికి గురయ్యాడు. తన చిరకాల ప్రత్యర్థి, మిత్రుడు రఫాల్ నాదల్‌ను కౌగిలించుకున్నాడు. ప్రేక్షకులు స్టేడియాన్ని హోరెత్తించారు. అనంతరం ఇంటర్వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి కూర్చున్నాడు. అతడు భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయాడు. ఇంటర్వ్యూ జరిగే టప్పుడు అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. "దీన్నుంచి (రిటైర్మెంట్ బాధ గురించి) ఎలాగైనా బయటపడతాం కదా? ఇప్పుడైతే సంతోషంగానే ఉన్నా. బాధ లేదు. చివరిసారిగా టెన్నిస్ ఆడటాన్ని ఎంజాయ్ చేశా. మ్యాచ్ గొప్పగా సాగింది. ఇంతకంటే ఆనందం ఇంకోటి లేదు. అద్భుతంగా ఉంది. ఒకే టీమ్‌లో నాదల్‌తో ఆడటం బాగుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ, లెజెండరీ ప్లేయర్స్ అందిరికీ నా కృతజ్ఞతలు" అని మ్యచ్ అనంతరం రోజర్ ఫెదరర్ మాట్లాడాడు.
ఫెదరర్, తల్లిదండ్రులు, భార్య మిర్కా.. పిల్లలు కోర్టులోకి వచ్చి.. అతడితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "నేను ఎప్పుడూ టీమ్ ప్లేయర్ గానే ఫీల్ అయ్యాను. సింగిల్స్ ఎప్పుడూ అలా చేయరు. కానీ నాకు ఒక టీమ్ ఉంది. వాళ్లు నేను ఎ్పప్పుడు ఎక్కడికి వెళ్లినా నా వెంట వచ్చారు. వాళ్లతో నా ప్రయాణం అద్బుతం. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. అలాగే.. నేను యాండీ, థామస్, క్యామ్, స్టెఫనోస్, నాదల్, క్యాస్పర్.. ఇంకా ఇతర టీమ్‌లు. మీరంతా చాలా అద్భుతమైన వ్యక్తులు. మీతో ఇన్ని లావేర్ కప్‌లు ఆడినందుకు గర్వంగా ఉంది. ఇది నాకొక వేడుకలా ఉంది. ఇలా చాలా అనందంగా ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నా.. ఇప్పుడు అది నేను అనుకున్నట్టే జరిగింది. అందరికీ కృతజ్ఞతలు" భావోద్వేగంతో ఫెదరర్ మట్లాడారు.
రోజర్ ఫెదరర్ 103 టూర్ లెవెల్ టైటిళ్లు సాధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 310 వారాల పాటు అత్యుత్తమ స్థానంలో ఉన్నాడు. ఫెదర్ తన ప్రత్యర్థి రఫేల్‌తో 2004లో మియామీలో జరిగిన ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్లో మొదటిసారి తలపడ్డాడు. ఇప్పటివరకు ఇద్దరు మొత్తంగా 39 సార్లు తలపడితే.. అందులో 24 సార్లు వివిధ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో బరిలోకి దిగారు.
తన కుటుంబ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "నేను అక్కడికి వెళ్లిపోవాలా?(నవ్వుతూ).. ఇప్పటివరకు నేను చేసింది ఓకే. ఇంతకముందు నేను ఎక్కువ మాట్లడలేదు. కానీ ఇప్పుడు కొంచెం మెరుగయ్యాను. నా భార్యా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఆమె అనుకుంటే ఎప్పుడో నేను ఆడకుండా ఆపేది.. కానీ అలా చేయలేదు. నన్ను ఎక్కడికైనా వెళ్లి ఆడేందుకు సపోర్ట్ చేస్తుండేది" అని చెప్పాడు.
రోజర్ ఫెదరర్ సాధించిన రికార్డ్‌లు:
- 20