ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కామన్వెల్త్​లో షూటింగ్​పై జోక్యం చేసుకోండి' - కామన్వెల్త్​ క్రీడల ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హమ్​ వేదికగా జరగనున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్​ను తొలగించవద్దని బ్రిటన్​ క్రీడాశాఖ సెక్రటరీకి లేఖ రాశారు భారత క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు. జూన్​లో సమావేశమైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీడబ్ల్యూఎఫ్).. రానున్న పోటీల్లో నుంచి షూటింగ్​ను తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది భారత ఒలింపిక్​ సంఘం.

'కామన్వెల్త్​లో షూటింగ్​పై జోక్యం చేసుకోండి'
author img

By

Published : Sep 5, 2019, 5:26 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

బర్మింగ్​హమ్​ వేదికగా 2022లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్​ను తొలగించొద్దని కోరుతూ యూకే క్రీడాశాఖ సెక్రటరీ నిక్కీ మోర్గాన్​కు లేఖ రాశారు భారత క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు. ఈ ఏడాది జూన్​లో సమావేశమైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీడబ్ల్యూఎఫ్).. ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి షూటింగ్​ను తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే భారత ఒలింపిక్​ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈవెంట్​ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది.

in article image
బ్రిటన్​ క్రీడాశాఖ సెక్రటరీ నిక్కీ మోర్గాన్​

" కామన్వెల్త్​ క్రీడల ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​లో ప్రస్తుతం భారత్​ ప్రాతినిధ్యం వహించట్లేదు. ఫలితంగా 2022 టోర్నీ నుంచి షూటింగ్​ తప్పించాలన్న నిర్ణయంపై మా అభ్యంతరాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నాం. కామన్వల్త్​లో 53 దేశాలు కలిసి ఉన్నాయి. వాటి జనాభా 2.4 బిలియన్​ కోట్లు. ఇందులో భారత్​ జనాభా సగం. ఈ సంఖ్యతో కామన్వెల్త్​ టోర్నీకి మరింత ఆదరణ లభిస్తుంది. భారత షూటర్లు ఇందులో ఆడాలని మా దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ షూటింగ్​ సమాఖ్య కూడా​ ఈ క్రీడను చేర్చితే కొంత మొత్తాన్ని భరించేందుకు సిద్ధమవుతోంది. కాబట్టి ఈ సమస్యలో మీరు కొంచెం కలగజేసుకోవాలని కోరుకుంటున్నా."
--కిరణ్​ రిజుజు, క్రీడాశాఖ మంత్రి

బర్మింగ్​హమ్​ వేదికగా కామన్వెల్త్​ క్రీడలు

బర్మింగ్‌హామ్‌లో షూటింగ్ క్రీడ లేకపోతే భారత్​కు పతక అవకాశాలు దెబ్బతింటాయి. సీడబ్ల్యూజీ ఆల్‌టైమ్ షూటింగ్ మెడల్స్ జాబితాలో భారత్​ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇండియా 118 పతకాలు సాధించగా.. వాటిలో 56 స్వర్ణాలు ఉన్నాయి.

Last Updated : Sep 29, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details