2020 అంటే కరోనా, లాక్‌డౌన్‌తో పాటు చాలా సంఘటనలు మనల్ని కుదిపేశాయి. ఎందరో ప్రముఖ క్రీడాకారులు కూడా ఇదే ఏడాది తుదిశ్వాస విడిచి శోకాన్ని మిగిల్చారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు మరణించారు? అనేదే ఈ కథనం.
కోబ్ బ్రయంట్ -బాస్కెట్ బాల్ ప్లేయర్ (1978-2020)
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లెజెండ్ కోబ్ బ్రయంట్.. జనవరి 26న హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోబ్తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె జియాన్నా, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుసార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచిన బ్రయంట్.. రెండుసార్లు(2008, 2012) ఒలింపిక్ స్వర్ణాన్ని గెల్చుకున్నాడు.
బల్బీర్ సింగ్ - హాకీ ఆటగాడు (1923-2020)
అనారోగ్య సమస్యలతో భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్.. ఈ ఏడాది మే 8న మొహాలీలో చికిత్స పొందుతూ, అదే నెల 25న మరణించారు. ఒలింపిక్స్ పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బల్బీర్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హకీ జట్టు కెప్టెన్‌గా మూడు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు అందుకున్నారు.
రాజిందర్ గోయల్ - క్రికెటర్ (1942-2020)
ఫస్ట్‌క్లాస్ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) జూన్ 21న మరణించారు. వయసురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. దేశవాళీలో మ్యాచ్ రిఫరీగానూ పనిచేశారు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశారు. ఈ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత ఈయనకే సొంతం.
చేతన్ చౌహాన్ - క్రికెటర్ (1947-2020)