తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫుట్​బాల్​ చరిత్రలోనే తొలిసారి అలా.. ఫ్యాన్స్​ షాక్​!

రీసెంట్​గా ఓ ఫుట్‌బాల్​ మ్యాచ్​లో జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఇలా జరగడం ఫుట్​బాల్ చరిత్రలోనే తొలి సారి. దీంతో ఇది చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Referee Shows First ever White Card In Benfica s Match
ఫుట్​బాల్​ చరిత్రలోనే తొలిసారి అలా..

By

Published : Jan 23, 2023, 2:49 PM IST

ఫుట్‌బాల్​ గేమ్​లో రిఫరీలు రెడ్‌, ఎల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగానే చూస్తుంటాం. గ్రౌండ్‌లో ప్లేయర్స్​ గొడవకు దిగినా, అసభ్య పదజాలాన్ని ఉపయోగించినా రెడ్‌కార్డ్‌ జారీ చేస్తారు. దీంతో ఆటగాళ్లు మ్యాచ్ ముగిసేవరకు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్‌ ఇచ్చి వదిలేయడానికి ఎల్లో కార్డ్​ను వినియోగిస్తారు. అయితే ఈ రెండు కార్డులు కాకుండా మరో కార్డు ఉంటుంది. అదే వైట్‌ కార్డ్‌. ఫుట్‌బాల్‌ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వైట్‌కార్డ్‌ చూపించింది లేదు. అయితే తాజాగా మహిళల ఫుట్‌బాల్‌ మ్యాచ్​లో మాత్రం రిఫరీ వైట్‌కార్డ్‌ చూపించడం విశేషం. తొలిసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది

ఎక్కడ జరిగిందంటే.. రీసెంట్​గా పోర్చుగల్‌లో మహిళల ఫుట్​బాల్​లో బెన్‌ఫికా, స్పోర్టింగ్‌ లిస్బన్‌ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్​లో మరి కాసేపట్లో తొలి హాఫ్‌ ముగుస్తుందన్న సమయంలో స్టాండ్స్‌లో ఓ ప్రేక్షకుడు అకస్మాతుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్‌ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్​ను క్రీడాస్ఫూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్‌ చూపించగానే అక్కడి వైద్య సిబ్బంది సదరు ప్రేక్షకుడికి చికిత్స అందించారు. జరగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్‌ కనుక క్రీడాస్ఫూర్తి చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్‌ అనంతరం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడిని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:క్రీడా రంగంలోకి విజయ్​ దేవరకొండ ఎంట్రీ.. ఆ జట్టుకు సహ యజమానిగా

ABOUT THE AUTHOR

...view details