తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడేజాకు 'అర్జున'- దీపా మాలిక్​కు 'ఖేల్​రత్న'! - విరాట్ కోహ్లీ

క్రికెటర్​ జడేజా అర్జున అవార్డుకు, పారా అథ్లెట్​ దీపా మాలిక్ ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. జస్టిస్​ ముకుందం ఆధ్వర్యంలోని కమిటీ వీరి పేర్లను ప్రతిపాదించింది.

జడేజాకు 'అర్జున'.. దీపా మాలిక్​కు 'ఖేల్​రత్న'

By

Published : Aug 17, 2019, 5:49 PM IST

Updated : Sep 27, 2019, 7:39 AM IST

క్రికెటర్​ రవీంద్ర జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులు అర్జున అవార్డుకు నామినేట్​ అయ్యారు. ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పురస్కారం కోసం పారా అథ్లెట్ దీపా మాలిక్​ పేరును ప్రతిపాదించింది జస్టిస్​ ముకుందం ఆధ్వర్యంలోని కమిటీ. బైచుంగ్ భూటియా, మేరీకోమ్ ఇందులో సభ్యులు.

ఇప్పటికే ఖేల్​రత్న కోసం రెజ్లర్​ బజరంగ్ పూనియా ఎంపికయ్యాడు.

రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 156 వన్డేలు, 42 టీ20లు, 41 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫార్మాట్లలో వరుసగా 2128, 135, 1485 పరుగులు చేస్తూ, 178, 32, 192 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే జరిగిన ప్రపంచకప్​ సెమీస్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత్​ను గెలిపించినంత పనిచేశాడు. కానీ ఆ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఓటమి పాలైంది టీమిండియా.

దీపా మాలిక్.. 2016 పారా ఒలింపిక్స్​లోని షాట్​పుట్​ విభాగంలో వెండి పతకం సాధించింది.​ గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లోని డిస్కస్​ త్రో, జావలిన్​ త్రో పోటీల్లో కాంస్యం గెల్చుకుంది.

గత సంవత్సరం, భారత్​ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను ఖేల్​రత్న అవార్డు దక్కించుకున్నారు. ఈ పురస్కారాన్ని తొలిసారిగా భారత ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ సొంతం చేసుకున్నాడు.​

ఇది చదవండి: రెజ్లర్​ బజరంగ్ పూనియాకు రాజీవ్ ఖేల్​రత్న

Last Updated : Sep 27, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details