ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో భారత రెజ్లర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా పురుషుల 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా స్వర్ణం దక్కించుకున్నాడు. శనివారం జరిగిన పోరులో అలిరెజా సర్లాక్ను 9-4 తేడాతో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. గతేడాది ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణంతో మెరిశాడు రవి.
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రవి దహియాకు స్వర్ణం - రవి దహియా ఆసియన్ ఛాంపియన్షిప్
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో భారత రెజ్లర్ రవి దహియా స్వర్ణం దక్కించుకున్నాడు. 57 కేజీల విభాగంలో అలిరెజాను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
![ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రవి దహియాకు స్వర్ణం Ravi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11442230-554-11442230-1618670273261.jpg)
రవి దహియా
శుక్రవారం జరిగిన పోటీల్లో మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ స్వర్ణం సాధించింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తనకు ఇదే తొలి బంగారు పతకం.