తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ దిగ్గజ రేసర్​పై డాక్యుమెంటరీ- త్వరలో రిలీజ్​

జర్మనీకి చెందిన ప్రముఖ ఎఫ్​1 రేసర్ మైఖేల్ షుమాకర్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ తెరకెక్కనుంది. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం.

By

Published : Jan 30, 2021, 8:00 PM IST

Racer schumacher documentary will be release
త్వరలోనే దిగ్గజ రేసర్​ షుమాకర్​ డాక్యుమెంటరీ విడుదల

ఫార్ములావన్‌ రేసింగ్​ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ జీవితంపై త్వరలోనే ఓ డాక్యుమెంటరీ రానుంది. ఏడుసార్లు ఎఫ్‌1 విశ్వవిజేతగా నిలిచాడు ఈ జర్మన్‌ స్టార్‌. 2013లో స్కీయింగ్‌ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు బయటి ప్రపంచానికి కనపడలేదు. కుటుంబసభ్యులు షుమాకర్​కు జెనివాలోనే చికిత్స అందిస్తున్నారని సమాచారం.

మైఖేల్‌ వెక్‌-బ్రూనో కమర్టన్స్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. షుమాకర్‌ భార్య వారికి తమ ప్రైవేట్‌ రికార్డింగ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్గజ రేసర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు ఈ డాక్యుమెంటరీ పెద్ద ఉపశమనం కలిగించనుంది. అయితే ఈ లఘుచిత్రం.. గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమైనట్లు సమాచారం.

ఇదీ చూడండి:ఎఫ్‌2 టైటిల్‌ను గెలుచుకున్న మిక్‌ షుమాకర్‌

ABOUT THE AUTHOR

...view details