తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ నెం.1కు మరోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్

Praggnanandhaa Magnus carlsen: భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఫిబ్రవరిలో జరిగిన 'ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ టోర్నమెంట్‌'లో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన అతడు.. ప్రస్తుతం జరుగుతున్న 'చెస్సబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌'లోనూ ఓడించాడు.

Praggnanandhaa Magnus carlsen
ప్రపంచ నెం.1కు మరోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్ ప్రజ్ఞానంద్

By

Published : May 21, 2022, 1:45 PM IST

Praggnanandhaa Magnus carlsen: భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరోసారి అద్భుతం చేశాడు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న 'చెస్సబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌'లో పాల్గొన్న వీరిద్దరూ ఐదో రౌండ్‌లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ హోరాహోరీగా ఆడడంతో చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపించింది.

అయితే, చివరి క్షణాల్లో కార్ల్‌సన్‌ 40వ మూవ్‌లో తప్పు చేయడంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. దీంతో మొత్తం 12 పాయింట్లు సాధించిన ఈ భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఈ టోర్నీలో నాకౌట్‌ దశకు చేరేందుకు మరింత దగ్గరయ్యాడు. ఇక శుక్రవారం సాయంత్రానికి అతడు ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. కార్ల్‌సన్‌ 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన 'ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ టోర్నమెంట్‌'లోనూ ప్రజ్ఞానంద.. ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు.

ఇదీ చూడండి: భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్​గా ఎదిగి

ABOUT THE AUTHOR

...view details