R Praggnanandhaa Top Rank : ప్రస్తుతం చెస్ క్రీడలో భారత్ అగ్ర శక్తిగా ఎదుగుతోందన్న సంగతి తెలిసిందే. మేధో శక్తితో ఆడే ఆ ఆటలో గత కొంత కాలంగా తన ప్రతిభతో అందరి దృష్టిని రమేశ్‌బాబు ప్రజ్ఞానంద ఆకర్షిస్తున్నాడు. భారత చెస్ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తున్నాడు. వరుస రికార్డులతో ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ చెస్ (Chess) సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు(ఆర్) ప్రజ్ఞానంద మరో రికార్డ్ సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను(Viswanathan Anand Chess) అధిగమించి నంబర్ 1 భారత చెస్ ప్లేయర్‌గా అవతరించాడు. తన కెరీర్‌లో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. బుధవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను (చైనా) ఓడించి ఈ ఘనత అందుకున్నాడు.
Praggnanandhaa Fide Rating : ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా - చెస్ దిగ్గజంవిశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. అంతేకాకుండా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ విభాగంలో వర్లడ్ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డుకు ఎక్కాడు.