తెలంగాణ

telangana

ETV Bharat / sports

PV Sindhu Indonesia Open : ఇండోనేసియా ఓపెన్​లో సింధు, ప్రణయ్​ శుభారంభం.. తొలి రౌండ్​లో విజయం ​ - పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్

PV Sindhu Indonesia Open : మంగళవారం ప్రారంభమైన ఇండోనేసియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, హెచ్​ఎస్ ప్రణయ్​ శుభరంభం చేశారు. తదుపరి రౌండ్​కి అర్హత సాధించారు. గత రెండు ఈవెంట్లలో మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన సింధు.. ఈ ఈవెంట్​లో తొలి రౌండ్​లో విజయం సాధించడం వల్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

pv sindhu indonesia open
pv sindhu indonesia open

By

Published : Jun 13, 2023, 6:09 PM IST

Updated : Jun 13, 2023, 6:21 PM IST

PV Sindhu Indonesia Open : గత కొంత కాలంగా టైటిల్​ దాహంతో ఉన్న భారత్ స్టార్ షట్లర్​ పీవీ సింధు.. మంగళవారం ప్రారంభమైన ఇండోనేసియా​ ఓపెన్​వరల్డ్​ టూర్ సూపర్​ 1000 ఈవెంట్​లో తొలి మ్యాచ్​ గెలిచింది. తన ప్రత్యర్థి జార్జియా మారిస్కా టూన్​జుంగ్​ (Gregoria Mariska Tunjung)(ఇండోనేసియా)పై 38 నిమిషాల్లో 21-19, 21-15 రెండు వరుస గేమ్​లలో విజయం సాధించి.. ప్రీ క్వార్టర్​ ఫైనల్​ బెర్త్​ను దక్కించుకుంది. సింధు ఆడిన చివరి రెండు ఈవెంట్లలో ఆమెకు నిరాశే ఎదురైంది. టైటిళ్లు సాధించలేక వెనుదిరిగింది.

వరల్డ్ ర్యాంకింగ్స్​లో 13వ స్థానానికి పడిపోయిన సింధూకు.. మొదట్లో జార్జియా 9-7తో లీడ్​ సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత పుంజుకున్న సింధు.. జార్జియా చేసిన తప్పిదాల వల్ల 11-10తో లీడ్​లోకి వచ్చి.. మొదటి గేమ్​లో గెలిచింది. ఈ ఉత్సాహంతో రెండో గేమ్​లో మొదటి నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో రెండో గేమ్​లోనూ విజయం సాధించి మ్యాచ్​ను సొంతం చేసుకుంది. తదుపరి మ్యాచ్​లో సింధు టా జు యింగ్​ (Tai Tzu Ying) (తైవాన్) ద్వారా సింధూకు గట్టి పోటీ ఎదురుకానుంది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మాడ్రిడ్​ మాస్టర్స్​ ఫైనల్​, మలేసియన్ మాస్టర్స్​ సెమీఫైనల్స్​లో మూడు గేమ్​ల్లో సింధూ, జార్జియా తలపడ్డారు. ఈ మూడు గేమ్​ల్లో సింధు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో జార్జిపై సింధు గెలవడం వల్ల.. ఈ ఇండోనేసియా టైటిల్​పై ఆశలు చిగురించాయి.

మరోవైపు.. ఫుల్​ ఫామ్​లో ఉన్న భారత స్టార్ షట్లర్​ హెచ్​ఎస్​ ప్రణయ్​ కూడా ఈ ఇండోనేసియా ఓపెన్​లో శుభారంభం చేశాడు. 50 నిమిషాల్లో జపాన్​కు చెందిన కెంటా నిషిమోటో(Kenta Nishimoto) (జపాన్)పై 21-16, 21-14 తేడాతో విజయం సాధించాడు. తన తదుపరి మ్యాచ్​లో ఎన్​ కా లాంగ్​ అంగస్​ (NG Ka Long Angus ) (హాంకాంగ్​)తో తలపడనున్నాడు. అయితే, మహిళల డబుల్స్​ ద్వయం ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్​ తొలిరౌండ్​లోనే రిన్​ ఇవానాగా (Rin Iwanaga), కీ నకనిషి (Kie Nakanishi) (జపాన్​) చేతిలో ఓడిపోయారు.

Malaysia Masters 2023 PV Sindhu : ఇటీవల జరిగినమలేసియా మాస్టర్స్​లో మంచి ప్రదర్శన కనబర్చిన సింధు.. సెమీ ఫైనల్​లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్​లో విభాగంలో 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో​ కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్​ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు.

Last Updated : Jun 13, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details