తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అన్యాయం జరిగింది'.. అంపైర్​తో సింధు వాగ్వాదం.. వీడియో వైరల్​ - పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షి

PV Sindhu fires on Umpire: ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ సెమీఫైనల్​లో తన ఓటమికి రిఫరీ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆరోపించింది భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు. రిఫరీ అన్యాయంగా విధించిన పెనల్టీ వల్లే ఫైనల్​ వెళ్లాల్సిన తాను ఓటమి పాలైనట్లు పేర్కొంది. ఈ విషయంపై ఆమె అంపైర్​తో గొడవ పడిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

pv sindhu fire umpire
పీవీ సింధు ఫైర్​ అంపైర్​

By

Published : May 1, 2022, 11:33 AM IST

PV Sindhu fires on Umpire: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో సెమీఫైనల్లో పీవీ సింధు ఓటమి చెందింది. జపాన్ ప్లేయర్ యమగూచి 21-13 19- 21 16- 21 తేడాతో సింధు ఓడింది. ఆ మ్యాచ్ లో త‌న‌ ఓటమికి రిఫ‌రీ తప్పుడు నిర్ణయాలే కారణమంటూ సింధు ఆరోపించింది. రెండో గేమ్ సింధు 14-11 తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రిఫ‌రీ సింధుకు పెనల్టీ పాయింట్ విధిస్తున్నట్లు ప్రకటించాడు.

"సర్వీస్‌ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో అన్నాడు. అయితే నేను సర్వీస్‌ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ రిఫరీ నా మాటలు పట్టించుకోకుండా యమగూచికి పాయింట్‌ ఇచ్చాడు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం. రెండో గేమ్‌లో 14-11తో ఆధిక్యంలో ఉన్నా. అలాగే జోరులో 15-11తో విజయానికి చేరవ అయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్‌ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. రిఫరీ ఇచ్చిన ఆ పాయింట్‌ న్యాయమైంది కాదు. ఈ మ్యాచ్‌లో నేను గెలిచి ఫైనల్‌కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్‌ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ అప్పటికే రిఫరీ పాయింట్‌ ఇచ్చేశాడు కదా అన్నాడు. ఒక చీఫ్‌ రిఫరీగా అతడు కనీసం ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సింది" అని సింధు పేర్కొంది. ఇక ఈ సెమీఫైనల్​లో ఓడిపోయిన సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది.

ఇదీ చూడండి: అది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం: రోహిత్​ శర్మ

ABOUT THE AUTHOR

...view details