ప్రముఖ భారత షట్లర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరింది. మహిళ సింగిల్స్ సెమీస్‌లో సింధుతో తలపడిన రష్యా క్రీడాకారిణి ఎవ్‌జెనియా కోసెట్‌స్కయా మ్యాచ్ మధ్యలోనే రిటైర్‌హర్ట్‌గా వైదొలగటం వల్ల సింధు ఫైనల్‌కు చేరుకుంది.
సయ్యద్ మోదీ టోర్నీ ఫైనల్‌కు సింధు - సయ్యద్ మోదీ టోర్నీలో ఫైనల్‌కు పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో తాను తలపడిన క్రీడాకారిణి ఎవ్‌జెనియా కోసెట్‌స్కయా మ్యాచ్ మధ్యలోనే రిటైర్‌హర్ట్‌గా వైదొలగటం వల్ల సింధు తుదిపోరుకు అర్హత సాధించింది.
PV Sindhu
తొలి గేమ్‌లో సింధు 21-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఎవ్‌జెనియా మ్యాచ్ నుంచి తప్పుకొంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సింధు భారత్‌కే చెందిన మాల్‌వికా బన్సోద్‌తో తలపడనుంది. సెమీస్‌లో భారత్‌కే చెందిన అనుపమా ఉపాధ్యాయను ఓడించి మాల్‌విక ఫైనల్ చేరుకుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!