తెలంగాణ

telangana

ETV Bharat / sports

PV Sindhu: సింధు.. ఈ ఏడాది ఆ లెక్క సరిచేస్తుందా?

PV Sindhu: ఆసియా గేమ్స్​, కామన్వెల్త్​ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి మంచి ఫామ్​ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఆ టోర్నీల్లో ఇప్పటివరకు దక్కని పసిడిని ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉందామె. ఈ ఏడాది కూడా వరుస టోర్నమెంట్​లతో బిజీగా గడపనున్న నేపథ్యంలో తన ప్రణాళికల గురించి వివరించింది సింధు.

PV Sindhu
పీవీ సింధు

By

Published : Jan 10, 2022, 6:41 PM IST

PV Sindhu: బిజీ సీజన్​లో సరైన ఈవెంట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు. ఇప్పటివరకు అందకుండా చేజారుతున్న కామన్వెల్త్​, ఆసియా గేమ్స్​ టైటిళ్లను ఈ ఏడాది ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉందామె. ఈ ఏడాది జులై-ఆగస్టులో బర్మింగ్​హామ్​ వేదికగా కామన్వెల్త్​ క్రీడలు జరగనున్నాయి. సెప్టెంబర్​లో చైనాలో ఆసియా గేమ్స్​ నిర్వహించనున్నారు.

సింధు

ఈ ఏడాది కూడా షట్లర్ల కోసం బిజీ షెడ్యూల్​ వేచిచూస్తోంది. మేజర్​ ఈవెంట్స్​తో పాటు ర్యాంకింగ్స్​ను మెరుగుపరచుకునేందుకు రెగ్యులర్​గా జరిగే సూపర్-1000, సూపర్​- 750, సూపర్-​500 లాంటి బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ ఈవెంట్స్​ కూడా ఉన్నాయి. మంగళవారం నుంచి ఇండియా ఓపెన్​ ఆరంభం కానున్న నేపథ్యంలో తన ప్రణాళికల గురించి వివరించింది సింధు.

"ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్​షిప్స్​తో పాటు కామన్వెల్త్​ గోల్డ్, ఆసియా గేమ్స్​ టైటిల్, ఆల్​ ఇంగ్లాండ్​ టైటిల్ గెలవాలని ఆశిస్తున్నా. చాలా టోర్నమెంట్​లు జరుగుతున్నాయి కాబట్టి, సరైన ఈవెంట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా ప్లాన్​ చేసుకోవాలి. ర్యాంకింగ్స్ కూడా చాలా ముఖ్యం. ప్రతి టోర్నీకి మానసికంగా, శారీరకంగా చాలా ఫిట్​గా ఉండాలి. ప్రతిసారి 100 శాతం కృషిచేయాలి. ప్రాక్టీస్​లో 100 శాతం కష్టపడితేనే మ్యాచ్​లో రాణించగలుగుతాం. కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ప్రయత్నంలో విఫలం కాకూడదు."

-పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

2021లో అద్భుతంగా రాణించింది సింధు. 2016లో రియో ఒలింపిక్స్​ రజతానికి గతేడాది టోక్యోలో గెలిచిన కాంస్యాన్ని జతచేసింది. వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో సిల్వర్​ సాధించిన సింధు.. టైటిల్​ మాత్రం చేజార్చుకుంది. ఈ ఏడాది మాత్రం ఆ లెక్క సరిచేయాలని చూస్తోంది.

ఒలింపిక్స్​ కాంస్య పతకంతో

సంతృప్తికరంగా ఉన్నా..

"గతేడాది పలు విజయాలు, అపజయాలు చవిచూశాను. మొత్తంగా నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నా. కొన్ని సెమీఫైనల్స్​ ఉన్నాయి, వరల్డ్ టూర్ ఫైనల్ సిల్వర్, ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్స్​లో ఓడాను. కానీ అక్కడా నా అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చా. ఇక ఒలింపిక్ పతకం నాకెంతో గర్వకారణం" అని సింధు పేర్కొంది.

పీవీ సింధు

2019లో ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన సింధు.. 2021 ఆరంభంలో థాయ్​లాండ్​ ఓపెన్​లో తడబడింది. అయితే మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్ ఫైనల్​ చేరి అదిరిపోయే కమ్​బ్యాక్​ ఇచ్చింది. అనంతరం జరిగిన టోక్యో మెగాటోర్నీలో కాంస్యం సాధించింది.

రెండు నెలల విరామం తర్వాత.. ఫ్రెంచ్​ ఓపెన్​​, ఇండోనేషియా మాస్టర్స్​, ఇండోనేషియా ఓపెన్​లను సెమీస్​తో ముగించింది. చివరగా వరల్డ్​ టూర్​ ఫైనల్స్​లో రజతం పట్టేసింది. అయితే ప్రపంచ ఛాంపియన్​షిప్​ గోల్డ్​ను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. 2017 తర్వాత పతకం లేకుండా తొలిసారి వెనుదిరిగింది.

రజతం పతకంతో

రెడీగా ఉన్నా..

"గతేడాది వరుస టోర్నమెంట్​లలో ఆడిన కారణంగా ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ తర్వాత ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నా. ఈ కొత్త సంవత్సరాన్ని ఇండియా ఓపెన్​తో మొదలుపెడుతున్నా. బాగా సన్నద్ధమయ్యాను. ఈ ఏడాది కూడా బిజీ షెడ్యూల్​ ఉంది. దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పింది సింధు.

సింధు

ఇండియా ఓపెన్​లో భారత్​కే చెందిన శ్రీకృష్ణ ప్రియతో తన పోరును ఆరంభించనుంది సింధు. ఈ టైటిల్​ను 2017లో సింధు గెలుచుకుంది. రెండు సార్లు ఇండియా ఓపెన్​ ఛాంపియన్​గా నిలిచిన సైనా నెహ్వాల్, థాయ్​లాండ్​కు చెందిన బుసానన్, సింగపూర్​కు చెందిన జియా మిన్​ యోతోనూ టైటిల్​ కోసం పోటీపడనుంది సింధు.

ఇదీ చూడండి:సింధుకు సులువైన డ్రా.. శ్రీకాంత్​, సైనాకు మాత్రం..

ABOUT THE AUTHOR

...view details