తెలంగాణ

telangana

ETV Bharat / sports

పీటీ ఉషకు ఐఏఏఎఫ్ అరుదైన గౌరవం - iaaf

భారత మాజీ అథ్లెట్ పీటీ ఉష ఐఏఏఎఫ్ వెటరన్​ పిన్​కు నామినేట్ అయ్యారు. క్రీడా రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను ఈ గౌరవంతో సత్కరించింది ఐఏఏఎఫ్.

ఉష

By

Published : Jul 18, 2019, 3:54 PM IST

భారత పరుగుల రాణి, మాజీ స్ప్రింటర్ పీటీ ఉష అంతర్జాతీయ అథ్లెట్ ఫెడరేషన్​(ఐఏఏఎఫ్) వెటరన్ పిన్​కు నామినేట్ అయ్యారు. క్రీడా సమాజానికి ఆమె చేసిన విశిష్ట సేవలకుగాను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ విషయాన్ని ఐఏఏఎఫ్ సీఈవో జాన్ రిడ్జ్యాన్​​ తెలిపారు.

"మిమ్మల్ని (పీటీ ఉష) నామినేట్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అథ్లెటిక్స్​లో మీరు చేసిన సేవలు మరపురానివి. సెప్టెంబరులో ఖతార్​లో జరగనున్న ఐఏఏఎఫ్ కాంగ్రెస్​ అవార్డు వేడుకకు ఆహ్వానిస్తున్నాం" -జాన్ రిడ్జ్యాన్, ఐఏఏఎఫ్ సీఈఓ

ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పీటీ ఉష ట్వీట్ చేశారు.

"ఐఏఏఎఫ్ నన్ను నామినేట్ చేయడం నాకు దక్కిన అమూల్యమైన గౌరవంగా భావిస్తా. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను" -పీటీ ఉష, భారత మాజీ అథ్లెట్

భారత్​లో ఉన్న అతితక్కువ మంది అథ్లెట్లలో పీటీ ఉష ముందుంటారు. ఆమె 5 విభిన్న విభాగాల్లో ఐదు స్వర్ణాలు సాధించారు. 100 మీటర్లు, 200మీ, 400మీ, 400మీ హర్డిల్స్​, 4x400 రిలేలో పసిడి సొంతం చేసుకున్నారు.

1985 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గారు. భారత్​ నుంచి ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి మహిళా అథ్లెట్​గా రికార్డు సృష్టించారు. 400 మీటర్ల హర్డిల్స్​లో త్రుటిలో(0.01 సెకండ్ల వ్యవధిలో) కాంస్యం చేజార్చుకున్నారు.

ఇది చదవండి: ఆ సిక్స్​ చూసి ప్రాణాలు విడిచిన నీషమ్​ కోచ్​​

ABOUT THE AUTHOR

...view details