కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యం కానుంది. ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ జయంతి రోజు ఇచ్చే క్రీడా అవార్డుల కోసం కేంద్ర క్రీడా శాఖ ఏప్రిల్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ ఇంకా మొదలవలేదు.
క్రీడా అవార్డుల దరఖాస్తులు ఆలస్యం - కరోనా వల్ల క్రీడా అవార్డుల దరఖాస్తులు ఆలస్యం
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యం కానుంది. సాధారణంగా ఏప్రిల్‌లోనే కేంద్ర క్రీడా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది షెడ్యూల్ మారే అవకాశం ఉంది.

"జాతీయ క్రీడా అవార్డుల దరఖాస్తుల ప్రక్రియకు క్రీడా శాఖ ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం, క్రీడా సమాఖ్యలు ఇంటి నుంచే పనిచేస్తున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యానికి అదే కారణం. మే నెలలో నోటిఫికేషన్ రావొచ్చు" అని క్రీడా శాఖ అధికారి తెలిపాడు. జాతీయ క్రీడా పురస్కారాల్లో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులు ఉంటాయి.
ఇదీ చూడండి : 'ఆరు సిక్సులు' తర్వాత బ్రాడ్ తండ్రితో యువీ చర్చ