ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం భారత బాక్సర్ల బృందం దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన స్పైస్‌జెట్ విమానం ల్యాండిగ్‌కు దుబాయ్ విమానాశ్రయ అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానం 45 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.
కొవిడ్ నిబంధనల కారణంగా బాక్సర్లు ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం. దీంతో భారత బాక్సర్లు మేరీకోమ్‌తో పాటు 30 మంది బృందం స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్‌కు వెళ్లారు. సమాచార లోపంతో యూఏఈ విమానాశ్రయ పరిధి లోపల విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు అక్కడి అధికారులు. అందుకు కారణం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కారణమని తాజాగా స్పష్టం చేశారు.