తెలంగాణ

telangana

ETV Bharat / sports

జులై 19 నుంచి కబడ్డీ కూత మొదలు - లీగ్

జులై 19 నుంచి ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ప్రారంభం కానుంది. పండుగ సమయాన్ని​ దృష్టిలో ఉంచుకుని తేదీని మార్చారు నిర్వాహకులు. అక్టోబర్ 9 వరకు ప్రేక్షకులను అలరించనుందీ ఆట.

కబడ్డీ

By

Published : Apr 8, 2019, 3:52 PM IST

ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది. జులై 19 నుంచి అక్టోబర్ 9 వరకు లీగ్ జరగనుంది. పండుగ సీజన్​ని దృష్టిలో ఉంచుకొని ఈ తేదీని ఖరారు చేసినట్లు ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.

ప్రో కబడ్డీ

"ఆరో సీజన్ మాదిరి అక్టోబరులో పోటీలు నిర్వహిద్దామని అనుకున్నాం. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జులై మాసమైతే అనుగుణంగా ఉంటుందని తేదీ మార్చాం. 2020లో జరిగే ఎనిమిదో సీజన్​ కూడా జులైలోనే ఉంటుంది" -అనుపమ్ గోస్వామి, పీకేఎల్ కమిషనర్

లీగ్​ కోసం13 దేశాలకు చెందిన 440 మంది ఆటగాళ్లకు వేలంసోమవారంజరగనుంది. 388 మంది దేశీయ ఆటగాళ్లుండగా.. 53 మంది విదేశీయులున్నారు. 12 ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు ఆటగాళ్లను కొనుక్కునేందుకు గరిష్ఠంగా రూ. 4.4 కోట్లు ఖర్చుపెట్టవచ్చు.

ABOUT THE AUTHOR

...view details