దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికవ్వడం తనకు దక్కిన అరుదైన గౌరవమని అంటోంది భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్. ఈ అవార్డు తనను వరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెల్లడించింది.
"ఖేల్రత్న అవార్డుకు ఎంపికవ్వడం నాకు దక్కిన గౌరవం. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. దేవుని దయ, మీ ఆశీస్సులతో రాబోయే అంతర్జాతీయ వేదికలపై మన దేశం గర్వించేలా ప్రదర్శలు చేస్తానని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. జైహింద్."