వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అథ్లెట్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
అలాగే.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.