ఒలింపిక్స్‌కు ముందు, తర్వాత భారత క్రీడాకారుల్లో ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఉత్సాహం నింపారు. మొదట పతకాలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించిన మోదీ.. వారు తిరిగొచ్చాక వారి ఆటతీరును ప్రశంసించారు. కాగా ఆయన మరో మంచి పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా జావెలిన్, కాంస్యాలు సాధించిన లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్, పీవీ సింధు రాకెటును వేలం వేయనున్నారని సమాచారం.
ఆగస్టు 16న ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ప్రతి క్రీడాంశానికి చెందిన అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పతకాలు తెచ్చినవారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను అభినందించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సింధుకు ఐస్‌క్రీం, నీరజ్‌కు చుర్మా తినిపించారు. అదే సమయంలో వారి వద్ద వేలం ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది.