Praggnanandhaa Sister Vaishali Grand Master: ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ తాజాగా ర్యాంకింగ్స్ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో.. చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి 2500+ రేటింగ్స్‌తో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా నిలిచింది. అయితే ఆర్ ప్రజ్ఞానంద.. ఇదివరకే గ్రాండ్‌మాస్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లుగా నిలిచి రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన తొలి మహిళ కూడా వైశాలీనే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. " అద్భుత విజయం సాధించిన వైశాలికి శుభాకాంక్షలు. భారత్ నుంచి మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు నుంచి మొదటి మహిళా గ్రాండ్‌మాస్టర్ కావడం అభినందనీయం. ఈ ఏడాది అద్భుతంగా సాగింది. మీ సోదరుడు ప్రజ్ఞానంద కూడా మంచి ప్రదర్శన చేశాడు. మీరిద్దరూ క్యాండెట్స్ టోర్నీకి అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. మీ పట్ల గర్వంగా ఉంది. నీ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శణీయం. చెస్‌ను క్రీడగా ఎంపిక చేసుకోవాలనుకునే వారికి నువ్వే స్ఫూర్తి. రాష్ట్రంలో మహిళా సాధికారికతకు ఇది ఒక నిదర్శనం" అని సీఎం అన్నారు.
Woman Grandmaster Of India: గ్రాండ్‌మాస్టర్లుగా నిలిచిన చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, పెండ్యాల హరికృష్ణ, హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి, బారువా తదితరుల సరసన వైశాలి చేరింది. ఇక తెలుగు ప్లేయర్లు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి తర్వాత గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన మూడో మహిళగా వైశాలి నిలిచింది.