తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​కు మళ్లీ భారీ షాకిచ్చిన ప్రజ్ఞానంద - ప్రజ్ఞానం మాగ్నస్‌ కార్ల్‌సన్​కు షాక్​

భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చి విజయం సాధించాడు. అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో అతడిని ఓడించాడు. ఈ విజయంతో టోర్నీ రన్​రప్​గా నిలిచాడు.

Praggnanandhaa  FTX Crypto Cup
ప్రపంచ ఛాంపియన్​కు మళ్లీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్

By

Published : Aug 22, 2022, 11:11 AM IST

Updated : Aug 22, 2022, 3:30 PM IST

భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద మరో ఘనతను సాధించి ఓ సూపర్​ రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో సోమవారం జరిగిన పోటీల్లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టైబ్రేక్​లో ఈ విజయం సాధించాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మాగ్నస్​ కార్లెసన్​ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది మూడోసారి. ఈ విజయంతో అతడు టోర్నీలో రన్​రప్​గా నిలిచాడు.

వీరిద్దరి మధ్య మొత్తం ఆరు గేమ్స్‌ జరగ్గా.. ప్రజ్ఞానంద మూడు సార్లు విజయం సాధించగా.. కార్ల్‌సన్‌ ఒక సారి గెలిచాడు. తొలి రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. మొత్తం మీద టోర్నిలో అత్యధికంగా 16 పాయింట్లు సాధించడంతో కార్ల్‌సన్‌ను విజేతగా ప్రకటించగా.. ప్రజ్ఞానంద 15 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు.

ఈ టోర్నమెంట్‌ను ప్రజ్ఞానంద వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించాడు. ప్రపంచ ఆరో ర్యాంక్‌ క్రీడాకారుడు లెవాన్‌ అర్నోయాన్‌ను 3-1 తేడాతో ఓడించాడు. ఒక దశలో కార్ల్‌సన్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగాడు. చైనా ఆటగాడు క్యూయాంగ్‌ లెయిమ్‌ లీ చేతిలో ఓడిపోవడంతో ఈ టోర్నిలో ప్రజ్ఞానంద విజయంపై ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలాండ్‌కు చెందిన జాన్‌ కె.డుడా చేతిలో కూడా ఓడిపోయాడు.

కార్ల్‌సన్‌తో జరిగిన నాలుగు గేమ్‌ల రౌండ్‌లో తొలి రెండు డ్రా చేసుకొన్న ప్రజ్ఞానంద.. మూడో గేమ్‌లో ఓడిపోయాడు. కీలకమైన నాలుగో గేమ్‌లో పుంజుకొని విజయం సాధించి.. మ్యాచ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన రెండు గేమ్‌ల్లోనూ విజయం సాధించి కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు.

ఇదీ చూడండి: ఆస్తులు అమ్మి శిక్షణ, అంతిమ్ విజయంతో వారి కల సాకారం

Last Updated : Aug 22, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details